Monday, December 23, 2024

అక్రమంగా తరలిస్తున్న 300 కిలోల బెల్లం పట్టివేత

- Advertisement -
- Advertisement -

రామగుండం: గుడుంబా తయారీలో వినియోగించే బెల్లంను అక్రమంగా తరలిస్తుండగా, రామగుండం ఎక్సైజ్ పోలీసులు, రామగుండం ఆర్‌పిఎఫ్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఆదివారం రాత్రి కేరళ ఎక్స్‌ప్రెస్‌లో రామగుండం ఎక్సైజ్ పోలీసులు, రామగుండం ఆర్‌పిఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 300 కిలోల బెల్లంను పట్టుకున్నట్లు, ఈ బెల్లాన్ని అక్రమంగా తరలిస్తున్న నిం ధితులు పరారైనట్లు రామగుండం ఎక్సైజ్ సిఐ సుంకరి రమేష్ తెలిపారు. పట్టుబడ్డ బెల్లం విలువ సుమారు 30వేల రూపాయలుంటుందని ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో రామగుండం ఎక్సైజ్ ఎస్‌ఐ శారద, సిబ్బంది ఖదీర్, రాజు, శ్రావణ్, రామగుండం ఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ సురేష్ గౌడ్, ఎస్‌ఐ సాయి కుమారి, సిబ్బంది గుర్జార్ రోహిత్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News