Friday, November 22, 2024

‘మైత్రి’ సంస్థకు చెందిన రూ. 110 కోట్ల ఆస్తుల సీజ్

- Advertisement -
- Advertisement -

Seizure of assets worth Rs 110 crore belonging to 'Maitri'

ఎపి, తెలంగాణ, కర్ణాటకలో 210 స్థిరాస్తులను అటాచ్ చేసిన ఇడి

మనతెలంగాణ/హైదరాబాద్ : గొలుసుకట్టు వ్యాపారం పేరిట మోసాలకు పాల్పడిన మైత్రి స్థిరాస్తి సంస్థకు చెందిన ఆంధ్రప్రదశ్, తెలంగాణ, కర్ణాటకల్లోని రూ. 110 కోట్ల రూపాయల విలువైన 210 స్థిరాస్తులను ఇడి అటాచ్ చేస్తూ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో సిఐడి అధికారులు 2013లో నమోదు చేసిన 12 ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఇడి దర్యాప్తు చేపట్టిన ఇడి మైత్రి ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ నక్షత్ర బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మంత్రి రియల్టర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న ఆస్తులను గుర్తించి తాత్కాలిక జప్తు చేసింది. తెలంగాణలో 13, ఎపిలో 196, కర్ణాటక ఓ ఖరీదైన స్థలాన్ని ఇడి అటాచ్ చేసింది. ఈక్రమంలో మైత్రి సంస్థకు చెందిన లక్కు కొండారెడ్డి, లక్కు మాల్యాద్రి రెడ్డి, లక్కు మాధవరెడ్డి, కొలికలపూడి బ్రహ్మారెడ్డి గొలుసుకట్టు వ్యాపారం పేరిట మోసాలకు పాల్పడ్డారని ఇడి అభియోగాలు నమోదు చేసింది. ఏలాంటి అనుమతులు లేకుండా ప్రజల నుంచి సుమారు రూ. 288 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించినట్లు ఇడి దర్యాప్తులో తేలింది. డిపాజిట్లకు అధిక లాభాలు, వాటి స్థానంలో ప్లాటు ఇస్తామంటూ గొలుసుకట్టు విధానంలో డిపాజిట్లు సేకరించారని ఇడి దర్యాప్తులో వెలుగుచూసింది. కాగా ప్రజల నుంచి వసూలు డిపాజిట్ల సొమ్ములో రూ. 158 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్లు ఇడి వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News