Monday, December 23, 2024

కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

మధిర : మధిరలో ఎక్సైజ్ సిబ్బంది విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయి పట్టుకున్నారు. ఉదయం కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు (భువనేశ్వర్ నుంచి ముంబయి వెళ్ళు)లో ఎక్సైజ్ స్టేషన్ మధిర, ఆర్‌పిఎఫ్, జిఆర్ పోలీస్ కలసి నిర్వహించిన తనిఖీలలో మధిర స్టేషన్‌లో (4) బ్యాగ్స్‌లో (17) పాకెట్లలలో మొత్తం (41) కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సిఐ మధిర కె.నాగేశ్వరరావు తెలిపారు.

దీని విలువ రూ.2,00,000 వరకు ఉంటుంది. ఈ కేసులో నిందితులు ఎవరూ దొరకలేదని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్‌ఐ చంద్రశేఖర్, శార్వాణి, సిబ్బంది రజాలి, గోపయ్య, రియాజ్, ముస్తఫా, జిఆర్‌పిహెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ రెడ్డి, ఆర్‌పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News