Monday, December 23, 2024

శేరిలింగంపల్లిలో భారీగా నకిలీ మద్యం సీసాల పట్టివేత

- Advertisement -
- Advertisement -

4 ఫుల్ బాటిళ్లు, పలు విదేశీ కంపెనీలకు చెందిన 294 ఖాళీ బాటిళ్లు,

500 ఖాళీ సీసా క్యాప్‌ల స్వాధీనం

మనతెలంగాణ/హైదరాబాద్:  శేరిలింగంపల్లిలో భారీగా నకిలీ మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ఖరీదైన స్కాచ్ బాటిల్‌లలో తక్కువ ధర కలిగిన మద్యాన్ని విక్రయిస్తున్న ఘరానా దొంగలను అరెస్టు చేసినట్టు శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపారు. నిందితుల దగ్గర మొత్తం 24 ఫుల్ బాటిళ్లు, పలు విదేశీ కంపెనీలకు చేందిన 294 ఖాళీ బాటిళ్లు, 500 ఖాళీ సీసా క్యాప్‌లను స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. పబ్లు, ప్రైవేటు ఈవెంట్‌లలో పని చేస్తున్న బార్ సిబ్బంది నుంచి ఈ ఖరీదైన ఖాళీ స్కాచ్ మద్యం బాటిళ్లులను నిందితులు సేకరించి ఆ సీసాల్లో తక్కువ ధర కలిగిన మద్యాన్ని పోసి అమ్ముతున్నారని ఆయన తెలిపారు.

ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ముగ్గురు నిందితులు ఎండి అజాం, సుశాంత్, సత్య సుందర్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఆయన పేర్కొన్నారు. శేరిలింగంపల్లి ఎక్సైజ్ పరిధిలోని మాదాపూర్‌లో అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ.శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో డిటిఎఫ్ సిఐ బి.ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఎఓ సిఐ లక్ష్మన్‌గౌడ్, డిటిఎఫ్ ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎన్.శ్రీనివాస్, యాదయ్య, ఫక్రుద్దీన్, గణేశ్ తదితరులు దాడులు జరిపి నిందితులను అరెస్టు చేసినట్టు ఎక్సైజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News