Wednesday, December 25, 2024

విదేశీ డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

విదేశీ డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది పట్టుకున్నారు. హైదరాబాద్ తార్నాక ఏరియాలోని లాలాపేట్ ప్రాంతంలో కుష్ అనే డ్రగ్స్‌ను విద్యార్థులకు విక్రయిస్తుండగా పట్టుకున్నారు. 33 గ్రాముల కుష్ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. మహ్మద్ ఖాన్ అలియాస్ అమన్, మహ్మద్ మొబిన్, నిఖిల్ నాయక్ ముగ్గురు కలిసి కుష్ డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ముగ్గురు నిందితులు అమెరికాలో పండించే కుష్ డ్రగ్స్‌ను కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకుని వచ్చి గ్రాముకు రూ.3,500లకు విక్రయిస్తున్నారు.

గంజాయి కంటే 26శాతం ఎక్కువగా మత్తు ఇస్తుంది. అలవాటు ఉన్న వారు సిగరేట్లలో నింపుకుని కుష్ డ్రగ్స్‌ను తీసుకుంటారు. షిప్పుల్లో నిందితులు కుష్ డ్రగ్స్‌ను బెంగళూరుకు తీసుకుని వస్తున్నారు. బెంగళూరుకు చెందిన వారి నుంచి ముగ్గురు నిందితులు కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది నిఘాపెట్టారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎస్సై బాలరాజు, సిబ ్బంది కలిసి దాడులు నిర్వహించి ముగ్గురుని పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News