ఖమ్మం : ఖమ్మం జిల్లా ఎక్సైజ్ అధికారి నాగేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు ఖమ్మం కొత్త బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం తనిఖీలు నిర్వహించగా ఒడిశా మల్కంగిరి జిల్లా సద్బాంపల్లీ గ్రామానికి చెందిన జోగా సోడి అలియాస్ జగదీష్ సాదుల రాముడు అలియాస్ రాము వద్ద (10) కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి, ముద్దాయిలను రిమాండ్ కు తరలించినట్లు ఖమ్మం ఎక్సైజ్ సిఐ కె .రాజు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు నుంచి గంజాయిని కొనుగోలు చేసి, వివిధ వాహనాల ద్వారా ఖమ్మం చేరుకుని ఇక్కడ నుంచి బస్‌లో హైదరాబాద్ ద్వారా కర్ణాటక లోని రాయచూర్ వెళ్లేందుకు బస్ స్టాండ్ కి వస్తుండగా తనిఖీలలో పట్టుబడినట్లు ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ అధికారులు వి.రవి, షేక్ రబ్బానీ, లత సిబ్బంది రామారావు, రమేష్, రవి, శశికాంత్, మారేశ్వరరావు, లలిత రమాదేవి పాల్గొన్నారు.