Wednesday, January 22, 2025

అక్రమ మద్యం పట్టివేత

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్ :అక్రమంగా విక్రయిస్తున్న మద్యం బాటిళ్లను ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ముషీరాబాద్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ గౌడ్ వివరాలు తెలిపారు. లాలపేటలో మంగళారపు వినోద్‌కుమార్ నిర్వహించే మై బార్ ను ఈ నెల 26న జూబ్లీ హిల్స్ ప్రాంతానికి మార్చారు. బార్ ను మార్చినప్పటికీ ఇంకా పాత బార్ వద్ద మద్యం బాటిళ్లను వినియోగదారులకు అక్రమంగా విక్రయిస్తున్న ట్టు ముషీ రాబాద్ ఎక్సైజ్ పోలీసులు సమాచారం తెలుసుకున్నారు. దీంతో లాలపేట మై బార్ వద్ద దాడి చేసిన పోలీసులు అక్రమంగా మద్యం విక్రయించే శ్రీశైలం అనే వ్యక్తితో పాటు సుమారు రూ. 1 లక్ష విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 16 కాటన్ల బీర్లు, 180 ఎంఎల్ విస్కీ బాటిళ్లు 234 , 10 ఫుల్ బాటిళ్లు, లీటరు బాటిళ్లు 8 పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్ చేయనున్నట్టు సిఐ లక్ష్మణ్ గౌడ్ చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐలు ఎం. శ్రావణ్ కుమార్, ఎన్. రమేష్‌బాబు, పి.నాగలక్ష్మీపాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News