Sunday, January 19, 2025

పిడిఎస్ బియ్యం పట్టివేత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ బియ్యాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ ఎస్‌ఓటి పోలీసులు శనివారం పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవంతీనగర్‌లోని ఓ ఇంట్లో పిడిఎస్ రైస్‌ను అక్రమంగా నిల్వ చేశారని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్న బాలానగర్ ఎస్‌ఓటి పోలీసులు ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 400 కిలోల పిడిఎస్ రైస్‌ను స్వాధీనం చేసుకున్నారు. బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ చేసిన ఓం ప్రకాష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కిరాణాషాపు నిర్వహిస్తున్నాడు. కేసు దర్యాప్తు కోసం నిందితుడిని సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సనత్‌నగర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News