Sunday, December 22, 2024

కారులో తరలిస్తున్న బెల్లం పట్టివేత

- Advertisement -
- Advertisement -

నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం తరలిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ సిబ్బంది తుక్కుగూడలో ఆదివారం పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 960 కిలోల బెల్లం, 100 కిలోల ఆలం, 4.5 లీటర్ల నాటుసారాను పట్టుకున్నారు.
హైదరాబాద్ తుక్కుగూడ ప్రాంతంలో ఎక్సైజ్ ఎస్ టి ఎఫ్ టీం ఒక కారులో నాటు సారాకు వినియోగించే బెల్లం ఆలం నాటు సారాను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ బేగంబజార్ నుంచి అచ్చంపేటలోని గ్రామానికి బెల్లాన్ని తరలిస్తున్నారని ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన ఎస్‌టిఎఫ్ సిబ్బంది తుక్కుగూడలో కారును ఆపారు.

అచ్చంపేటకు చెందిన కారు డ్రైవర్ బాదావత్ పాండు కారులో బెల్లాన్ని తరలిస్తున్నాడు. వెంటనే పాండును అదుపులోకి తీసుకున్న సిబ్బంది, బెల్లం, కారు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్ బాదావత్ పాండుపై కేసు నమోదు చేశారు. దాడి చేసిన వారిలో ఎస్‌టిఎఫ్ ప్రదీప్ రావుతో పాటు సిఐ బిక్ష, ఎస్సై బాలరాజు, సిబ్బంది కృష్ణ, యాదగిరి సతీష్ ఉన్నారు. కేసు దర్యాప్తు కోసం అచ్చంపేట ఎక్సైజ్ సీఐ కృష్ణయ్యకు అప్పగించారు. కారులో బెల్లాన్ని తరలిస్తున్న సమాచారాన్ని తెలుసుకొని పట్టుకున్న ఎస్టిఎఫ్ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విబి కమల హసన్ రెడ్డి అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News