Wednesday, November 13, 2024

వాహన తనిఖీలలో గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం : ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్థన్ రెడ్డి, అసిస్టెంట్ కమీషనర్ గణేష్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ తిరుపతి ఆదేశాల మేరకు ఖమ్మం ఎన్ఫోర్స్‌మెంట్ సిఐ సర్వేశ్వర్, కొత్తగూడెం ఎక్సైజ్ సిఐ జయశ్రీ ఆధ్వర్యంలోబుధవారం సిబ్బంది కొత్తగూడెంలోని ఇల్లందు క్రాస్‌రోడ్, లోతువాగు దగ్గర రూట్ వాచ్, వాహన తనిఖీలు నిర్వహించారు. ఒడిశా నుంచి మహారాష్ట్రలోని ఓ కారులో 19 కేజీల గంజాయిని పూనెకు చెందిన ప్రవీణ్, బాలు, భుజబల్‌లు తరలిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ తనిఖీలలో ఎస్‌ఐలు అనిల్, అశోక్, హెడ్ కానిస్టేబుల్స్ కరీం,బాలు, కానిస్టేబుల్స్ సుదీర్, హరీష్, వెంకటేష్, హన్మంతరావు, రామారావులు పాల్గొన్నారు.

  • పాల్వచలో గంజాయి పట్టివేత

బస్సులో తరలిస్తున్న గంజాయిని పట్టుకొన్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. భద్రాచలం నుండి కొత్తగూడెం వైపునకు వైళుతున్న ఆర్‌టిసి బస్సులో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారంతో పాల్వంచ ఆబ్కారీ సిఐ గురునాధ్ రాథోడ్ తన సిబ్బందితో కలిసి సీతానగర్ కాలనీలో తనిఖీ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆర్‌టిసి బస్సులో 40 కిలోల గంజాయిని తరలిస్తున్నట్లు గమనించారు. గంజాయితో పాటుగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఆబ్కారీ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయంపై సిఐ వివరణ కోరటానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News