Thursday, January 23, 2025

ఎన్నికలు జరుగనున్న కర్నాటకలో రూ. 375 కోట్లు పట్టివేత

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఎన్నికల ప్రవర్తనా నియమావళి మార్చి 29 నుంచి అమలులోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల నేపథ్యంలో కర్నాటకలో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు మొత్తం రూ. 375 కోట్లకుపైగా జప్తు చేశాయని ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది.

స్వాధీనం చేసుకున్న మొత్తం( రూ. 375 కోట్లు), నగదు(రూ. 147 కోట్లు), మద్యం(రూ. 84 కోట్లు), బంగారం, వెండి(రూ. 97 కోట్లు), ఉచిత వస్తువులు (రూ. 24 కోట్లు), డ్రగ్స్, నార్కోటిక్స్(రూ. 24 కోట్లు) ఈడి కార్యాలయంలో ఉన్నాయని కర్నాటక ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఈ జప్తుకు సంబంధించి 2896 ఎఫ్‌ఐఆర్‌లు బుక్ అయ్యాయి. మే 10న అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందు జప్తు మొత్తం రూ. 58 కోట్లు( అది మార్చి 9 నుంచి మార్చి 27 వరకు).

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News