సిటీ బ్యూరో: బిసి బంధు లబ్దిదారుల ఎంపికను ఈ నెల 23వ తేదీ లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను అదేశించారు. శుక్రవారం పశు సంవర్థకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధర్ సిన్హా, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, బిసి సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశం, పంచాయితీ రాజ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఎస్‌సి అభివృద్ది రాహుల్ బొజ్జా , మైనార్టీ సంక్షేమ శాఖ ఒమర్ జలీల్ జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్‌లతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ఇళ్ల స్థలాల పంపిణీ, గృహాలక్ష్మి, జిఓ 59, నోటరీ భూముల క్రబద్దీకరణ, కారుణ్య నియామకాలు, దళిత, బిసి, మైనారిటిల బంధు తదితర అంశాలపై శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ ద్వారా సమిక్షించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ అనదీప్ మాట్లాడుతూ బిసి , మైనార్టీ బఃధు పరిశీలన త్వరలో పూర్తి చేయడంతో పాటు జిఓ 59లో పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ , డిఆర్‌ఓ వెంకటాచారి, ఎస్‌సి కార్పొరేషన్ ఈడి రమేశ్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి యాదయ్య, బిసి సంక్షేమ శాఖాధికారి ఆశన్న, జిల్లా మైనార్టీ అభివృద్ది అధికారి ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.