Monday, January 20, 2025

వారం రోజుల్లో ఎంపి అభ్యర్థుల ఎంపిక

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: వారం రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, లోక్‌సభ ఎన్నికల్లో తాము ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 28న అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు. గురువారం తమ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. కేంద్రంలో మళ్లీ వ చ్చేది బిజెపి సర్కార్‌నని  లక్షమంది ఒవైసీలు వచ్చినా మోడీని ప్రధాని కాకుండా అడ్డుకోలేరని సవాల్ విసిరారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని విమర్శిస్తూ కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు మజ్లీస్ పార్టీని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.

అసదుద్దీన్‌ను ఓడించడమే తమ లక్షమన్నారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిపై ఈ ప్రభుత్వం విచారణ చేసి శిక్షలు వేస్తుందంటే అది భ్రమేనని, తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని, బిజెపి అగ్గి లాంటి పార్టీ అని, ఏ పార్టీతోను కలవదన్నారు. విపక్ష పార్టీల నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇతర పార్టీలు విమర్శలు చేయాలని చురకలు వేశారు. కమలం, గులాబీ పార్టీలు ఒక్కటే అంటే చెప్పుతో కొట్టే పరిస్థితి వస్తుందని, అసదుద్దీన్ ఒవైసీ మొనగాడు ఏమీ కాదన్నారు. ప్రతి రోజు అయోధ్యకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మూర్ఖుడు అని మండిపడ్డారు. ముస్లింలందరూ ఆ పార్టీతో ఏమీ లేరన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News