Sunday, December 22, 2024

ముస్లిం మైనారిటీ అభ్యర్థులను డ్రా పద్దతిలోఎంపిక

- Advertisement -
- Advertisement -

మధిర : మధిర మునిసిపాలిటీ పరిధిలో 2022-/23 సంవత్సరాం కు సంబందించిన ముస్లిం మైనారిటీ స్వయం ఉపాధి పథకం క్రింద రుణాల కోరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులను మధిర మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత, కమీషనర్ రమాదేవి, డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ యంఎ.మైబుది ఆధ్వర్యంలో మైనారిటీ అభ్యర్థులను సమక్షంలో ఆరుగురు అభ్యర్థులను డ్రా పద్దతి ద్వారా ఎంపిక చేశారు.

మొత్తం 65 మంది అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోగా అందులో మహిళ కేటగిరీ-1 (లక్ష రూపాయలు)లో మహిళ అభ్యర్థి ఒకరు, జనరల్ కేటగిరీ -1లో ముగ్గురిని మహిళ కేటగిరీ-2 (రెండు లక్షలు)లో ఒకరిని జనరల్ కేటగిరీ-2 లో ఒకరిని ఈ విధముగా ఆరుగురు అభ్యర్థులను డ్రా పద్దతి ద్వారా ఎంపిక చేశారు. ఎంపిక కాబడిన అభ్యర్థుల సర్టిఫికెట్స్ మొత్తం జిల్లా లెవెల్ కమిటీ వారికి పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మెప్మా టిఎంసి ఉపేంద్రమ్మ, ముస్లిం మైనారిటీ అభ్యర్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News