Monday, November 18, 2024

జులైలోనే ఐపిఎల్ కొత్త జట్ల ఎంపిక?

- Advertisement -
- Advertisement -

Selection of new teams for IPL in July itself

 

ముంబై: ప్రపంచం క్రికెట్‌లోనే అత్యంత జనాదారణ కలిగిన లీగ్‌గా పేరు తెచ్చుకున్న ఇండియన్ ప్రీమియర లీగ్ విస్తరణ కార్యక్రమాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఇందులో భాగంగా జులైలోనే రెండు కొత్త ఫ్రాంచైజీలను విక్రయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇక ఒక్కో ఫ్రాంచైజీ విలువ దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఐపిఎల్‌కు ఉన్న ఆదరణ నేపథ్యంలో వేలాది కోట్ల రూపాయలను సయితం వెచ్చించి ఫ్రాంచైజీలను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో వ్యాపార దిగ్గజాలు ఉన్నారు. ప్రస్తుతం ఐపిఎల్‌లో ఐదు జట్లు ఉన్న విషయం తెలిసిందే.

అయితే వచ్చే సీజన్ నుంచి జట్ల సంఖ్యను పదికి పెంచాలని బిసిసిఐ నిర్ణయించిది. నిజానికి ఈ ఏడాదే కొత్త ఫ్రాంచైజీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈసారి 8 జట్లతోనే ఐపిఎల్‌ను నిర్వహించారు. ఇక వచ్చే సీజన్‌లో మొత్తం పది జట్లు పోటీ పడనున్నాయి. ఇదిలావుండగా కొత్త జట్లను కొనుగోలు చేసేందుకు పలు దిగ్గజ సంస్థలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. దీని కోసం ఎన్ని కోట్ల రూపాయలైన వెచ్చించేందుకు ఆయా వ్యాపార సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. కాగా, వచ్చే నెలలో ఐపిఎల్ కొత్త ఫ్రాంచైజీల విక్రయం కోసం బిసిసిఐ భారీ ప్రణాళికలు రచిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News