Thursday, December 26, 2024

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌కు విద్యార్థుల ఎంపిక పూర్తి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్, అచ్చంపేట, వెల్దండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌లో గల 9 బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ 2023,24 విద్యా సంవత్సరానికి విద్యార్థుల ఎంపిక పూర్తి చేసినట్లు జిల్లా షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి అధికారి రామ్ లాల్ తెలిపారు. 1వ తరగతిలో 88సీట్లు, 5వ తరగతిలో 90సీట్లు కేటాయించగా శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం తల్లిదండ్రుల సమక్షంలో జిల్లా పరిషత్ సిఈఓ ఉష ఆధ్వర్యంలో విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

జిల్లాకు చెందిన వారై ఉండి గ్రామీణ స్థాయి వారు లక్షా 50వేలు, పట్టణ స్థాయి వారు 2లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగి ఉండి దరఖాస్తు చేసుకున్న 633 మంది విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో సీట్ల కేటాయింపు రిజర్వేషన్ ప్రకారం విద్యార్థులను లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరిగిందని ఆయన తెలిపారు. సోమవారం నుంచి ఎంపికైన విద్యార్థులకు కౌన్సిలింగ్ ద్వారా పాఠశాలలకు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు.

ధృవీకరణ పత్రాలతో కులము, ఆదాయం, నివాసం, రేషన్ కార్డు, జనన తేది ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు ఒరిజినల్ పత్రాలను జిల్లా షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో వెరిఫికేషన్ చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ సోషల్ వెల్ఫేర్ అధికారి సుదర్శన్, సూపరిండెంట్ రాంజీ, సెక్షన్ ఇంచార్జి కవిత, జిల్లా పరిషత్ షెడ్యుల్డ్ కులాల కార్యాలయ సిబ్బంది బాలస్వామి, ఆంజనేయులు, హాస్టల్ వెల్ఫేర్ అసొసియేషన్ వార్డెన్లు రామస్వామి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News