Sunday, December 22, 2024

తుఫ్రాన్ లో స్వచ్ఛందంగా విద్యా, వ్యాపార సంస్థల బంద్..

- Advertisement -
- Advertisement -

మెదక్: ప్రజాగాయకుడు, ఉద్యమకారుడు, ప్రజాయుద్ధనౌక గద్దర్ మృతితో మెదక్ జిల్లా తుఫ్రాన్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రజలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుపుతున్నారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ తుఫ్రాన్ లో విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు అన్ని స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.

1949లో తూప్రాన్‌లో గుమ్మడి లచ్చమ్మ శేషయ్యలకు రెండవ సంతానంగా గద్దర్(గుమ్మడి విఠల్ రావు) జన్మించారు. చిన్నప్పటి నుంచే చాలా చలాకీగా ఉన్న గద్దర్ పదవ తరగతి వరకు తూప్రాన్‌లోనే విద్యాభ్యాసం చేశారు. గత యేడాదిన్నరక్రితం ‘ఎట్లున్నది నా ఊరు’ అనే పుస్తకాన్ని రూపొందించేందుకు తూప్రాన్‌కు వచ్చి సన్నిహితులతో మాటమంతి కలిపారని స్తానికులు తెలుపుతున్నారు. ఆ పుస్తకం ఇంకా పూర్తికాలేదని చివరి దశలో ఉంది. గత ఆరునెలల క్రితం తన ఓటరు ఐడిని తూప్రాన్‌కు మార్చుకున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతానికి హైదరాబాద్ అల్వల్‌లోని నివాసం ఉంటున్నారు. స్వస్థలం తూప్రాన్‌లో ప్రస్తుతానికి ఆయన బంధువులు ఎవరు లేరు. గత కొంతకాలం క్రితం వరకు తన సోదరుడు నర్సింగరావు ఉండేవారు. అతను కూడా చనిపోవడంతో ప్రస్తుతం తూప్రాన్‌లోని సొంత నివాసంలో ఎవరు ఉండటం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News