Monday, December 23, 2024

కరాటేతో యువతులకు ఆత్మరక్షణ

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి : యువతకు కరాటే ఆత్మరక్షణలో ఎంతో ఉపయోగపడుతుందని, కరాటే బ్లాక్ బెల్ట్‌లు సాధించేలా కరాటే నేర్చుకోవడం విద్యార్థినీలలో ఉన్న ప్రతిభ అని డిసిసిబి వైస్ చైర్మెన్ పట్నం మాణిక్యం అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని మహిళ డిగ్రీ కాలేజీలో మహిళ విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించారు.

ఈ సందర్బంగా పట్నం మాణిక్యం మాట్లాడుతూ… యువతకు, విద్యార్థులకు పట్నంమాణిక్యం ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు. విద్యార్థులు, క్రీడకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఆటల పోటీలు, కరాటే శిక్షణలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం కరాటేలో శిక్షణ పొదిన విద్యార్థులకు సర్టిఫికెట్‌లతో పాటు మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కరాటే మాష్టార్ మల్లేశం, ఉపాధ్యాయులు, కాలేజీ ప్రిన్సిపాల్ తదితరులున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News