Thursday, January 16, 2025

దివ్యాంగులకు స్వయం ఉపాధికి పథకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దివ్యాంగులకు జీవనోపాధి కల్పించేందుకు స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తున్నామని వికలాంగులు, వయోవృద్ధులు,ట్రాన్స్‌జెండర్, వ్యక్తుల సాధికారత శాఖ డైరెక్టర్ శైలజ తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరం 2022- 23లో రాష్ట్రంలో అర్హులైన వికలాంగులకు స్వయం ఉపాధి, పునరావాసం పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంలో భాగంగా వికలాంగులకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో వ్యవసాయ,అనుబంధ పరిశ్రమలు, సేవా వ్యాపారములను స్థాపించుకుని తద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొంది,

సాధారణ జీవనాన్ని గడిపేందుకు ఈ పథకం ద్వారా రుణాలు అందజేయనున్నారు. అర్హులైన వికలాంగుల నుంచి ఈ నెల- 16 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్‌లైన్ www.tsobmms.cgg.gov.inలో స్వీకరిస్తామని ఆమె తెలిపారు. పూర్తి వివరాల సంబంధిత జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు, వికలాంగుల,వయో వృద్ధుల శాఖ సహాయ సంచాలకులను సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు కార్యాలయ ఫోన్ నంబరు 040- 24559048లో సంప్రదించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News