Tuesday, December 3, 2024

ఢిల్లీ జైలులో 25 మంది ఖైదీలకు స్వీయ గాయాలు

- Advertisement -
- Advertisement -

Self-inflicted injuries on 25 inmates at Delhi Jail

న్యూఢిల్లీ: మండోలి జైలులోని 25 మంది ఖైదీలు తమను తాము గాయపరుచుకున్నట్లు జైలు అధికారులు మంగళవారం తెలిపారు. 11వ బ్యారెక్‌లో ఉంచిన ఖైదీలలో ఇద్దరిని వార్డు నుంచి బయటకు వెళ్లడానికి అధికారులు అనుమతించకపోవడంతో సోమవారం సాయంత్రం వారితోపాటు మరి కొందరు ఖైదీలు తమను తాము గాయపరుచుకున్నారని, వారంతా స్వల్పంగా గాయపడ్డారని అధికారులు చెప్పారు. గాయపడిన ఖైదీలలో ఒకరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొంది తిరిగివచ్చేశాడని అధికారులు వివరించారు. ఎటువంటి కారణం లేకుండా తమను వార్డు నుంచి బయటకు పంపాలంటూ ఇద్దరు ఖైదీలు అధికారులను కోరారని, అందుకు అధికారులు అనుమతించకపోవడంతో వారిద్దరూ తమను తాము గాయపరుచుకోవడంతో ఇతర ఖైదీలను రెచ్చగొట్టి వారి చేత స్వీయ గాయాలు చేయించారని డైరెక్టర్ జనరల్(ఢిల్లీ కారాగారాలు) సందీప్ గోయెల్ తెలిపారు. వారందరూ చాలా స్వల్పంగా గాయపడ్డారని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News