Tuesday, December 24, 2024

బలహీన వర్గాల అభ్యున్నతికి, అభివృద్ధికి ఆత్మగౌరవ భవనాలు దోహదం

- Advertisement -
- Advertisement -

ఈ నెల 27వ తేదీన నలుగురు మంత్రుల చేతుల మీదుగా పెరిక కుల ఆత్మగౌరవ భవనం ప్రారంభం
భూమి పూజ మహోత్సవం పోస్టర్‌ను విడుదల చేసిన మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

మనతెలంగాణ/హైదరాబాద్:  బలహీన వర్గాల అభ్యున్నతికి, అభివృద్ధికి ఆత్మగౌరవ భవనాలు దోహదపడతాయని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. నలుగురు మంత్రుల చేతుల మీదుగా ఈ నెల 27వ తేదీన తెలంగాణ పెరిక కుల ఆత్మగౌరవ భవనానికి భూమి పూజ జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర పెరిక సంఘం సమావేశంలో అల్లం నారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్ , తలసాని శ్రీనివాస్ యాదవ్, వి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు.

రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల కోసం ఆత్మగౌరవ భవనాల నిర్మించాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని మీడియా అల్లం నారాయణ అన్నారు. బడుగు,బలహీన వర్గాల వికాసానికి ఆత్మగౌరవ భవనాలు ఎంతగానో తోడ్పడతాయన్నారు. విద్యతోపాటు సామాజిక రాజకీయ సాంస్కృతిక ఆర్థిక స్వావంలంభన కోసం బడుగు,బలహీన వర్గాలు వ్యూహాత్మకంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అల్లం నారాయణ పిలుపు ఇచ్చారు. పెరిక కుల ఆత్మగౌరవ భవన భూమి పూజ మహోత్సవం పోస్టర్‌ను అల్లం నారాయణ ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దాలింగయ్య, పెరిక కుల ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ గటిక విజయ్‌కుమార్, పెరిక సంఘం నాయకులు వలిశెట్టి సత్యనారాయణ, సుంకరి ఆనంద్, భూసాని శ్రీనివాస్, దొంగరి మనోహర్, చుంచు ఉషన్న, గాండ్ల రాములు, కుంచాల శ్రీనివాస్, బత్తిని పరమేష్, సుందరి వీరభాస్కర్, అచ్చ రఘుకుమార్, శ్రీరాం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News