Wednesday, January 22, 2025

ఆధ్యాత్మిక గురువు ముసుగులో అత్యాచారం: నిందితుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇద్దరు మహిళలపై లైంగిక దాడి జరిపిన ఒక స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువును ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని కక్రోలా ప్రాంతంలో మాతా మససని చౌకీ దర్బార్ పేరిట ఆశ్రమంతోపాటు ఒక యూట్యూబ్ చానల్ నడుపుతున్న 33 ఏళ్ల వినోద్ కాశ్యప్‌ను ఇద్దరు మహిళలు ఇచ్చిన వేర్వేరు ఫిర్యాదు ఆధారంగా ద్వారకా ఉత్తర పోలీసు స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డిపిసి(ద్వారక) ఎం. హర్షవర్ధన్ బుధవారం తెలిపారు.

మీ సమస్యలు పరిష్కరిస్తానంటూ సాయం చేసే సాకుతో ఇద్దరు మహిళలను తన ఆశ్రమానికి పిలిపించుకుని గురు సేవ చేయాలని వారిని బలవంతం పెట్టాడు. వారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు ఈ విషయం బయటకు చెబితే చంపివేస్తానంటూ కూడా బెదిరించాడని డిసిపి తెలిపారు.అతడు నపుపుతున్న యూట్యూబ్ చానల్‌కు పెద్ద సంఖ్యలో పాలోవర్లు ఉన్నారని కూడా డిసిపి చెప్పారు. ఐపిసిలోని 376, 506 సెక్షన్ల కింద నిందితుడిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News