Wednesday, January 22, 2025

ఎల్‌ఒసి సమీపంలో సెల్ఫీ పాయింట్ విశిష్టత

- Advertisement -
- Advertisement -

ఉరి (కాశ్మీర్) : కాశ్మీర్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఒసి) సమీపంలోని ఒక సెల్ఫీ పాయింట్ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా మారిందని ఉరిలో అధికారులు తెలియజేశారు. మైమరిపించే ఉరి మారుమూల సరిహద్దు ప్రాంతం అందాన్ని కెమెరాలో బంధించేందుకు, జీలం నది సుందర దృశ్యం వీక్షణకు అది అవకాశం కల్పిస్తోందని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో జాతీయవాద భావానికి ప్రతీకగా పర్యావరణ అందాలను ఆస్వాదించేందుకు ‘ఇండియా సెల్ఫీ పాయింట్’ సందర్శకులకు వీలు కల్పిస్తోందని అధికారులు తెలిపారు. ఉరిలో ఎల్‌ఒసి వద్ద జీరో పాయింట్ ‘కమాన్ సేతు’ను పర్యాటకుల కోసం సైన్యం నిరుడు తెరిచింది. ఆ సెల్ఫీ పాయింట్‌ను సాధారణ ప్రజల కోసం ఈ ఏడాది రిపబ్లిక్ దినోత్సవం సందర్భంలో తెరిచారు. ఆ సెల్ఫీ పాయింట్‌కు సూత్రధారి కళాకారిణి, ఆర్‌ఎన్‌ఎఎఫ్ వ్యవస్థాపకురాలు రూబుల్ నగీ.

జాతీయ రహదారి 44పై వ్యూహాత్మకంగా దానిని ఏర్పాటు చేయడమైంది. రమణీయ జీలం నది సుందర దృశ్యాన్ని చూసేందుకు అది వీలు కల్పిస్తోందని, స్థానికులకు, పర్యాటకులకు అది గర్వ కారణంగా నిలుస్తున్నదని అధికారులు చెప్పారు. మహిళా సాధికారత ప్రాజెక్టులకు పేరొందిన నగీ ఫౌండేషన్‌కు సైన్యంధన్యవాదాలు తెలియజేసింది. కాగా, తన చిత్ర కళ ద్వారా దేశం పేరిట శిల్ప రూపం ఇవ్వడం దేశ స్వాతంత్య్రం కోసం సమాజంలోని వివిధ వర్గాలు చేసిన త్యాగాలకు నివాళి అని నగీ పేర్కొన్నారు. దాల్ సరస్సు రాజ్‌బాగ్‌లో పునరుద్ధరించిన పోలో వ్యూ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన దానితో సహా కాశ్మీర్‌లో సెల్ఫీ పాయింట్ల రూపకల్పనకు సూత్రధారి నగీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News