Wednesday, January 22, 2025

నిస్సయస్థితిలో చిరుత సంచరం

- Advertisement -
- Advertisement -

దామరగిద్ద:  మండలంలోని కంసాన్పల్లి గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో నిస్సహాయ స్థితిలో చిరుత సంచరించడాన్ని అటుగా వెళుతున్న కొంతమంది చిరుత సంచరాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పెట్టారు. ఆ నోట ఈ నోట ప్రజలందరికీ తెలియడంతో చిరుతని చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకోవడం జరిగింది.నిస్సహాయ స్థితిలో ఉన్న చిరుత దగ్గరకు వెళ్లి కొంతమంది యువకులు సెల్ఫీలు తీసుకోవడం జరిగింది. నిస్సహాయ స్థితిలో ఉన్న చిరుతని చూసి అటవీ శాఖ అధికారులకు,

మండల పోలీస్ లకు, వెటర్నరీ డాక్టర్కు సమాచారం అందించడం జరిగింది. సమాచారం తెలుసుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు మరియు మండల పోలీసులు వెటర్నరీ డాక్టర్ చిరుత సంచరిస్తున్న ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. చిరుతకు ఏమైంది అనే విషయం అటవీశాఖ అధికారులకు గాని వెటర్నరీ డాక్టర్కు గాని అర్థం కాలేదు. చిరుతకు ఏమి జరిగింది అనే విషయం తేల్చడానికి హైదరాబాద్ నుంచి అటవీ శాఖ అధికారులు వచ్చి నిర్ధారిస్తారు అని నారాయణపేట అటవీశాఖ అధికారులు తెలియజేయడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News