Sunday, January 19, 2025

ఐఫోన్ నకిలీ విడిభాగాల విక్రయం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఐ ఫోన్ నకిలీ విడిభాగాలను విక్రయిస్తున్న నలుగురు నిందితులను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్, దోమలగూడ, అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1,300, నకిలీ యాపిల్ లోగోలు, యూఎస్‌బి 280, బ్యాటరీలు 63, బ్లాక్‌గ్లాస్ 335, యూఎస్‌బి పవర్ అడాప్టర్ 140, ఐఫోన్ బ్యాటరీ ప్యాక్ 11, ఈయర్ పాడ్స్ 32ను స్వాధీనం చేసుకున్నారు. భారత రామ్ జగదీష్ మార్కెట్‌లో మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. పదం సింగ్ జగదీష్ మార్కెట్‌లో న్యూ కలెక్షన్ టార్గెట్ మొబైల్ షాపు, విసారామ్ పురోహిత్ అలియాస్ విశాల్ పిఎస్ టెలికాం మొబైల్ షాపు ఏర్పాటు చేశాడు.

సికింద్రాబాద్ మోండామార్కెట్‌లో శివవర ప్రసాద్ ట్రినిటీ షాప్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ట్రినిటీ షాప్ యజమాని దినేష్ పరారీలో ఉన్నాడు. నలుగురు నిందితులు యాపిల్ మొబైల్‌కు సంబంధించిన లోగోలు, ఎయిర్‌పాడ్స్, యూఎస్‌బి కేబుల్స్ తదితరాలను నకిలీ తీసుకుని వచ్చి ఒరిజినల్‌గా నమ్మిస్తు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇన్స్‌స్పెక్టర్ రాజు నాయక్, ఎస్సైలు సాయికిరణ్, నవీన్‌కుమార్ తదితరులు నిందితులను పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం ఆయా పరిధిలోని పోలీస్ స్టేషన్లకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News