Thursday, December 26, 2024

నగరంలో జోరుగా ఎండిఎంఏ

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు దాదాపుగా డ్రగ్స్ విక్రయం, స్మగ్లింగ్‌ను నియంత్రించారు. అన్ని రకాల డ్రగ్స్ కొకైన్, ఎక్టసీ, గంజాయి, వీడ్ తదితరాలపై ఉక్కుపాదం మోపినా చాలామంది డ్రగ్స్ స్మగ్లర్లు ఎండిఎంఏ డ్రగ్స్‌ను ఎక్కువగా నగరానికి తీసుకుని వస్తున్నారు. గతంలో నైజీరియన్లు ఎక్కువగా కొకైన్‌ను ముంబాయి, గోవా, బెంగళూరు నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ విక్రయించేవారు. కానీ ఇటీవలి కాలంలో ఎక్కువ మంది స్మగ్లర్లు ఎండిఎంఏను ఎక్కువగా హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. స్మగ్లర్లపై ఉక్కుపాదం మో పుతున్న పోలీసులు ఇటీవల కొందరు డ్రగ్స్ విక్రేతలను పట్టుకోగా వారి వద్ద ఎండిఎంఏ లభించింది. వీరు ఎక్కువగా రాజస్థాన్, గోవాల నుంచి ఎండిఎంఏను కొనుగో లు చేసి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి విక్రయిస్తున్నారు. బెంగళూరు, ముంబాయి, ఢిల్లీ నుంచి ఎక్కువ గా నైజీరియన్లు డ్రగ్స్ తీసుకుని వచ్చి ఇక్కడ డ్రగ్స్ వియ్రిస్తుండడంతో పోలీసులు వారిని పట్టుకునేందుకు హైదరాబాద్ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో ముమ్మరంగా గాలించి డ్రగ్స్ ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేశారు.

హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన నిందితులను గుర్తించిన పోలీసులు వారిని వేటాడి పట్టుకున్నారు. దీం తో కొకైన్, ఎక్టసీ తదితర డ్రగ్స్ రావడం ఆగిపోయింది, దీనికి తోడు పోలీసులు డ్రగ్స్ విక్రేతలు, కొనుగోలు దారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ విక్రయించేవారిపై గతంలో పోలీసులు ఎక్కువగా నిఘా పెట్టేవా రు, కాని వినియోగించే వారిని వదిలివేయడంతో వారు విచ్చలవిడిగా డ్రగ్స్‌ను కొనుగోలు చేయడమే కా కుండా తెలిసిన వారికి విక్రయిస్తున్నారు. ఇటీవలి కాలంలో గంజాయి, హాష్ ఆయిల్, డ్రగ్స్ వినియోగించిన వారే విక్రేతలుగా మారుతున్నారు. పోలీసులు పట్టుకోవడంతో ఈవిషయం బయటపడింది, చాలామంది వినియోగదారులు డ్రగ్స్ వాడడంతో ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. దీంతో తామే తెలిసిన వారి వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకుని వచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ముంబాయి, గోవా,బెంగళూరు నగరాల నుంచి ఎక్కువగా డ్రగ్స్ తెచ్చేవారిపై పోలీసులు నిఘా పెట్టడంతో కొందరు డ్రగ్స్ విక్రేతలు రూట్‌మార్చారు. రాజస్థాన్ రాష్ట్రం నుంచి డ్రగ్స్ తీసుకుని వస్తున్నారు.

నిందితులు రాజస్థాన్‌లో తమకు తెలిసిన వారి నుంచి డ్రగ్స్ తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా స్మగ్లర్లు ఎండిఎంఏ డ్రగ్స్‌ను ఇటీవలి కాలంలో ఎక్కువగా రాజస్థాన్ రాష్ట్రం నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. కొంద రు రైలు, బస్సుల్లో ఎండిఎంఏను నగరానికి తీసుకుని వచ్చారు. మరో నిందితుడు ఎండిఎంఏను ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మిల్లేట్స్‌లో డ్రగ్స్ పెట్టుకుని లారీ తీసుకుని వచ్చి ఇక్కడ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. యూసుఫ్‌గూడకు చెందిన మిర్జా అస్ఘర్ అలీబైగ్, మహ్మద్ సాజిద్, మహ్మద్ అబ్దుల్ సలాం కాన్ రెండేళ్ల నుంచి ఎండిఎంఏ విక్రయిస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వారి 12 గ్రాముల ఎండిఎంఏను స్వాధీనం చేసుకున్నారు.

బతుకుదెరువు కోసం వచ్చి…
చాలామంది డ్రగ్స్ స్మగ్లర్లు బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి ఏదో ఒక వ్యాపారం చేస్తున్నారు. తమ బంధువులు తమ సొంత రాష్ట్రం రాజస్థాన్‌లో ఉండడంతో వారి ద్వారా తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి ఇక్కడ అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇటీవలి కాలంలో పట్టుబడిన వారిలో ఎక్కువ మంది వారే ఉన్నారు. రాజస్థాన్ రాష్ట్రం తెలంగాణకు చాలా దూరం ఉండడంతో పోలీసులు దీనిపై ఎక్కువగా దృష్టి పెట్టడంలేదు. దీనిని అవకాశంగా తీసుకున్న స్మగ్లర్లు రాజస్థాన్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకుని హైదరాబాద్‌కు వచ్చి అవసరం ఉన్న వారికి ఎక్కువ ధర కు విక్రయించి సులభంగా డబ్బులు సంపాదిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News