Thursday, January 23, 2025

81కోట్ల మంది సమాచారం అమ్మకం?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో అతిపెద్ద డేటా లీక్ అయినట్టు సమాచారం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వద్ద గల 81.5 కోట్ల మంది భారత పౌరుల వ్యక్తిగత సమాచారం లీక్ అయింది. కరోనా టెస్టుల సమాచారం నుం చి ఈ డేటా కలెక్ట్ చేసినట్టు త్రెట్ యాక్టర్ అనే ఓ ఎక్స్ హ్యాండిల్ వెల్లడించింది. ఇది చాలా సున్నితమైన విషయం కావడంతో ఐసిఎంఆర్ ఫిర్యాదు చేయగానే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద ర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సైట్ హ్యాక్ చేసి లీక్ చేసిన ఈ సమాచారాన్ని డార్క్ వెబ్‌లోని బ్రీచ్డ్ ఫోరమ్‌లో అమ్మకానికి పెట్టాడు. ఇందులో 81.5 కోట్ల భారత పౌరుల సమాచా రం ఉన్నది. ఆధార్, పాన్‌కార్డు, పేర్లు, ఫోన్ నెం బర్లు, చిరునామా సహా పలు వ్యక్తిగత వివరాలు అందులో ఉన్నాయి. ఈ సమాచారం లీక్ అయినట్టు సిఇఆర్‌టిఇన్ ఐసీఎంఆర్‌కు తెలియజేసినట్టు సమాచారం. లీక్ అయిన శాంపిల్స్ సమాచారాన్ని ఐసిఎంఆర్ వద్దనున్న సమాచారంతో పోల్చితే మ్యాచ్ అయిందని, దీంతో అన్ని దర్యా ప్తు ఏజెన్సీలు రంగంలోకి దిగినట్టు తెలిసింది.

ఈ వ్యవహారంలో విదేశీ శక్తుల ప్రమేయం ఉండటంతో దేశ ఉన్నత దర్యాప్తు ఏజెన్సీ రంగంలోకి దిగనుంది. ప్రస్తుతానికైతే నష్ట నివారణ కోసం అవసరమైన పద్ధతులను అనుసరిస్తున్నారు. కరోనా టెస్టుల డేటా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసి), ఐసీఎంఆర్, కేంద్ర ఆరోగ్య శాఖలకు వెళ్తుంది. అయితే, ఈ డేటా ఎక్కడి నుంచి లీక్ అయిందనే స్పష్టత ఇంక రాలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అమెరికన్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెక్యూరిటీ తొలుత ఈ డేటా లీక్‌ను గుర్తించింది. ఈ త్రెట్ యాక్టర్ అలియాస్ పీడబ్ల్యూఎన్0001 అక్టోబర్ 9వ తేదీన బ్రీచ్ ఫోరమ్స్‌లో ఓ త్రెడ్ పోస్టు చేశాడని తెలిపింది. 81.5 కోట్ల మంది భారత పౌరుల ఆధార్, పాస్‌పోర్టు వంటి రికార్డులను అందుబాటులో ఉంచినట్టు వివరించింది. ఆధార్ డేటాను ప్రూఫ్‌గా పేర్కొంటూ నాలుగు పెద్ద శాంపిల్స్‌లో ఈ డేటాను స్పెడ్ షీట్స్‌లలో పీడబ్ల్యూఎన్0001 షేర్ చేశాడని వెల్లడించిం ది. హంటర్ అనలిస్ట్ ఈ డేటా జెన్యూన్ అని, ఆధార్ కార్డు డేటాను ప్రభుత్వ వెబ్ సైట్‌లోని వెరిఫై ఆధార్ ఫీచర్ ద్వారా సరిపోల్చి చూశాడని తెలిపింది. భారత ఆరోగ్య వ్యవస్థను హ్యాకర్లు లక్ష్యం చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతేడాది ఎయిమ్స్ ఈ ముప్పును పలుమార్లు ఎదుర్కొంది. ఫిబ్రవరి నుంచి ఐసిఎంఆర్ సర్వర్లను హ్యాక్ చేయడానికి సుమారు 6,000 సార్లు ప్రయత్నాలు జరిగాయి. ఈ విషయం ఐసిఎంఆర్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థల అవగాహనలో ఉన్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News