Thursday, December 19, 2024

రాష్ట్రానికి మరో భారీ పరిశ్రమ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో రూ.890 కోట్ల సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు చే సేందుకు ఆధునాతన సిస్టమ్, ప్యాకేజీ టెక్నాలజీ, ఏపిఎసిటి సంస్థలు ముందుకు వచ్చాయి. బుధవా రం ఐటి పరిశ్రమలశాఱ మంత్రి శ్రీధర్‌బాబుతో ప రిశ్రమ ప్రతినిధులు సమావేశం అయ్యారు. దక్షిణ కొరియాకు చెదిన ఏఎస్‌ఐపి, ఏపిఏసిటి సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో ఈ సెమీ కండక్టర్ పరిశ్రను ఏర్పాటు చేయనున్నాయి. పరిశ్రమ ఏర్పాటకు కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడాన్ని మంత్రి శ్రీధర్‌బాబు స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పరిశ్రమల ఏర్పాటుకు సర్గధామంగా మారిందని, వీటి ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధ్ది చెందుతుందన్నారు.. రాష్ట్రంలో భారీఎత్తున పెట్టుబుడులు పెట్టి నిరుద్యోగ యవతకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు ప్రభుత్వ సహకారం ఎంతగానో ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News