Saturday, September 14, 2024

సేన (యుబిటి), రాణె మద్దతుదారుల ఘర్షణ

- Advertisement -
- Advertisement -

శివాజీ విగ్రహం పతనం ప్రదేశానికి ఆదిత్య థాక్కరే రాక
మల్వన్ (మహారాష్ట్ర) : సింధుదుర్గ్ జిల్లాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోయిన ప్రదేశానికి శివసేన (యుబిటి) పార్టీ కార్యకర్తలు, బిజెపి నేత నారాయణ్ రాణె మద్దతుదారులు బుధవారం చేరుకున్నప్పుడు రెండు పక్షాల మధ్య సంఘర్షణ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ నిరుడు డిసెంబర్ 4న సింధుదుర్గ్ జిల్లా రాజ్‌కోట్ కోటలో ఆవిష్కరించిన 35 అడుగుల శివాజీ విగ్రహం సోమవారం మధ్యాహ్నం కూలిపోయింది. ఆ ఘటన రాజకీయ వివాదంగా మారింది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) మహాయుతి ప్రభుత్వాన్ని లక్షంగా చేసుకుని, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రాజీనామాను కోరింది.

విగ్రహం కూలిన తరువాత పరిస్థితిని సమీక్షించేందుకు సేన (యుబిటి) నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య థాక్కరే బుధవారం రాజ్‌కోట్ కోట చేరుకున్నారు. అదే సమయంలో మాజీ కేంద్ర మంత్రి, రత్నగిరి సింధుదుర్గ్ లోక్‌సభ ఎంపి నారాయణ్ రాణె తన పెద్ద కుమారుడు, మాజీ ఎంపి నీలేశ్ రాణె, మద్దతుదారుల కొందరితో కలసి ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ఆదిత్య కోట లోపల ఉండగా రాణెలు పోలీసులతో వాదించడం కనిపించింది. ఆ వెంటనే ఆదిత్య, రాణె మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు, భద్రత సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇబ్బంది పడడం కనిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News