Sunday, December 22, 2024

సేనాపతి నేనే…

- Advertisement -
- Advertisement -

హీరో కార్తి, ‘అభిమన్యుడు’ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తోంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తుండగా, రజిషా విజయన్, చుంకీ పాండే కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇటీవలే విడుదలైన ‘సర్దార్’ టీజర్‌కి అన్ని వర్గాల ప్రేక్షల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది.

తాజాగా ఈ చిత్రం నుండి ‘సేనాపతి నేనే’ పాటని విడుదల చేశారు. జివి ప్రకాష్ కుమార్ హుషారైన జానపద గీతంగా ఈ పాటని కంపోజ్ చేశారు. ఎనర్జిటిక్ డ్యాన్సింగ్ బీట్ స్కోర్ చేసిన ఈ పాట జనరంజకంగా అలరిస్తోంది. అనురాగ్ కులకర్ణి ఈ పాటని ఫోక్ స్టయిల్ లో ఆలపించగా.. చంద్రబోస్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ఈ పాటలో కార్తి గెటప్ జానపద గీతానికి తగినట్లు పులి చర్మదారిగా కనిపించి ప్రత్యేకమైన నృత్యరూపకంతో అలరించారు. భారీ నిర్మాణ విలువలు వున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సర్దార్’ దీపావళికి తెలుగు, తమిళంలో థియేట్రికల్ విడుదల కానుంది.

Senapathi nene song out from ‘Sardar’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News