Tuesday, November 5, 2024

భారీ సంఖ్యలో పర్యాటకులను పంపండి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతీయుల నుంచి ఎదురుదాడి ప్రారంభమైన దరిమిలా మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు మంగళవారం చైనాను శరణుకోరారు. తమ ద్వీప దేశానికి మరింత మంది పర్యాటకులను పంపడానికి చర్యలను ముమ్మరం చేయవలసిందిగా చైనాకు ఆయన విజ్ఞప్తి చేశారు. అధికార పర్యటన నిమిత్తం చైనా వచ్చిన ముయిజు ఫుజియిన్ ప్రావిన్సులో మాల్దీవ్స్ బిజినెస్ ఫోరమ్ సదస్సులో ప్రసంగిస్తూ చైనాను మ్లావులకు అత్యంత సన్నిహిత మిత్రునిగా అభివర్ణించారు. చైనా తమ దేశానికి అత్యంత సన్నిహిత మిత్రదేశంతోపాటు అభివృద్ధి భాగస్వామిగా ఆయన పేర్కొన్నారు.

కొవిడ్‌కు ముందు చైనా తమకు నంబర్ ఒన్ మార్కెట్‌గా ఉండేదని, ఈ పరిస్థితిని పునరుద్ధరించడానికి చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని, భారతదేశాన్ని కించపరుస్తూ కొందరు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల పర్యవసానంగా రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం తలెత్తింది. దరిమిలా భారత పర్యాటకులు పెద్ద సంఖ్యలో తమ మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే మాల్దీవుల అధ్యక్షుడి నుంచి చైనాకు ఈ విజ్ఞప్తి వచ్చింది. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బిఆర్‌ఐ) ప్రాజెక్టుపై ముయిజు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ప్రాజెక్టులో చేరడానికి ఆయన సంసిద్ధతను తెలిపారు. మాల్దీవులపై సమగ్ర పర్యాటక మండలిని అభివృద్ధి చేయడానికి 50 మిలియన్ డాలర్ల ఒప్రాజెక్టు కోసం రెండు దేశాలు సంతకం చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News