Wednesday, January 22, 2025

‘సెంగోల్’పై చెప్పేదంతా బోగస్సే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సెంగోల్ రాజదండం దేశంలో బ్రిటిషు పాలకుల నుంచి అధికార ధారదత్తానికి ప్రతీక అని తెలిపే సాక్షాధారాలు ఏమీ లేవని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు. అధికార మార్పిడికి సెంగోల్ ప్రతీక అని లార్డ్ మౌంట్‌బాటెన్, సి.రాజగోపాలాచారి, జవహర్‌లాల్ నె హ్రూ చెప్పారనడం నిరాధారమని స్పష్టం చేశారు. ప్రధా ని మోడీ ఆయన వెంట ఉండే బాజాభజంత్రీల బృందం తమిళనాడులో రాజకీయ ప్రయోజనాలకు దీనిని ఇప్పు డు వాడుకొంటోందన్నారు. బిజెపిభజన బృందానికి వా స్తవాలను తమకు అనుకూలంగా మల్చుకునే దర్జీతనం బాగా అలవాటు అయిందన్నారు.

ఇప్పు డు రాజదండం ప్రశ్న ఎందుకు? నూతన పార్లమెంట్ భవనాన్ని పద్ధతి ప్రకారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూతో ఎందుకు ఆవిష్కరింపచేయడం లేదని మోడీని జైరాం రమేష్ నిలదీశారు. ఆ రాజదండం అధికార మార్పిడికి తార్కాణం అనడం, అప్పటి నేతలు ఈ విషయం స్పష్టం చేశారనడం ఇవన్నీ కీలక ప్రశ్నల నుంచి ప్రజలను పక్కదోవపట్టించడానికే అని విమర్శించారు. ఈ నెల 28న (ఆదివారం) నూతన పార్లమెంట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించనుండటం వివాదాస్పదం అయింది. రాజ్యాంగ అధినేత హోదాలో ఉన్న రాష్ట్రపతికి ఈ గౌరవం దక్కాల్సి ఉంటుందని పే ర్కొంటూ కాంగ్రెస్ సహా 20 ప్రతిపక్ష పార్టీలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News