- Advertisement -
హైదరాబాద్ : ప్రముఖ సినీయర్ నటుడు శరత్ బాబు మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆయన బెంగళూరులో చికిత్స తీసుకున్నారు. తాజాగా ఆయన పరిస్థితి విషమించడంతో ఆయనను హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు కుటుంబసబ్యులు.
ప్రస్తుతం శరత్ బాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం ఐసియూ నుంచి జనరల్ రూంకు తరలించినట్లు ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది. శరత్ బాబు అనారోగ్యం బారిన పడ్డారని తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవానలి దేవుడిని ప్రార్థిస్తున్నారు.
- Advertisement -