Thursday, January 23, 2025

సిల్క్ స్మిత అందుకే అప్పుల పాలైంది: కాకినాడ శ్యామల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాకినాడ శ్యామల గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు. ఆమె దాదాపుగా రెండు వందల పైగా సినిమాల్లో నటించింది. ఆమె ఎక్కువగా తెలుగు, తమిళ భాషల్లో నటించింది. కాకినాడ శ్యామల
నటిగా, నిర్మాతగా, ఫైనాన్షియర్‌గా కాకినాడ శ్యామల గుర్తింపు దక్కించుకున్నారు. అలాగే తెలుగు తెరపై మత్తుకళ్ల సుందరిగా సిల్క్ స్మితకి పేరు ఉంది. ఆమె మరణించి చాలాకాలం అవుతున్నా ఇప్పటికి ఆమెను ఎవరూ మరిచిపోలేదు. అంతగా ఆమె తన హావభావాలతో .. గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అలాంటి సిల్క్ స్మిత గురించి తాజా ఇంటర్వ్యూలో కాకినాడ శ్యామల ప్రస్తావించారు. కాకినాడ శ్యామల మాట్లాడాతూ..నేను చాలా సినిమాలకు ఫైనాన్స్ చేశా. అలాగే సిల్క్ స్మిత సొంత సినిమాకి కూడా డబ్బులిచ్చాను. అయితే ఆ ఒక్క సినిమా సరిగా ఆడకపోవడంతో సిల్క్ స్మిత అప్పుల పాలై ఆస్తులన్నీ పోగొట్టుకుందని ఆమె అన్నారు. సిల్క్ స్మిత వ్యక్తిత్వం చాలా గొప్పదని,ఆమె చాలా నిజాయతీ గల మనిషి అన్నారు. ఆమె ఎందుకు చనిపోయిందో, ఎలా చనిపోయిందో ఇంతవరకు ఎవరికి తెలియదని. కొంతమంది ఆమెను హత్య చేశారని, కొంతమంది ఆమె ఆత్మహత్య చేసుకుందని అన్నారని శ్యామల తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News