Monday, March 31, 2025

హైకోర్టులో విషాదం..

- Advertisement -
- Advertisement -

హైకోర్టులో విషాదం నెలకొంది. హైకోర్టులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్‌రావు గుండెపోటుకు గురయ్యారు. హైకోర్టులో కేసును వాదిస్తున్న సమయంలో న్యాయవాది ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆస్పత్రికి తరలించేలోపే మార్గ మధ్యలోనే వేణు గోపాల్ రావు మృతి చెందారు. న్యాయవాది మృతికి సంతాపంగా హైకోర్టులో అన్ని బెంచ్‌లలో జడ్జిలు విచారణను నిలిపివేశారు. అన్ని కోర్టులో విచారణలు బుధవారానికి న్యాయమూర్తులు వాయిదా వేశారు. హైకోర్టులో మంగళవారం మధ్యాహ్నం లంచ్ విరామం తర్వాత ఓ కేసు విషయం లో వేణుగోపాల్ తన వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాదనలు వినిపిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

వెంటనే స్పందించిన తోటి న్యాయవాదులు సిపిఆర్ చేసినప్పటికీ కూడా లాయర్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించేందుకు ప్రయ త్నించగా మార్గ మధ్యలోనే వేణుగోపాల్ రావు ప్రాణాలు కోల్పోయారు. కేసు వాదిస్తూ పడిపోయిన సమయంలో కళ్లు తిరిగి పడిపోయారని అంతా భావించారు. వెంటనే ఆస్పత్రిక తరలించగా గుండెపోటుతో న్యాయవాది మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. న్యాయవాది మృతి పట్ల న్యాయ మూర్తులు విచారం వ్యక్తం చేస్తూ అన్ని విచారణలను వాయిదా వేశారు. సీనియర్ న్యాయవాది మృతితో తోటి లాయర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News