Thursday, January 23, 2025

బిజెపి సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోడీ ఇకలేరు

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోడీ(72) సోమవారం రాత్రి క్యాన్సర్ వ్యాధితో ఢిల్లీ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన బీహార్ ఉపముఖ్యమంత్రిగా 2005-2013 వరకు, మళ్లీ 2017-2020 వరకు పనిచేశారు. ఆయన మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, తదితర సీనియర్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

బీహార్ లో బిజెపి ఎదగడానికి సుశీల్ కుమార్ మోడీ చాలా కృషి చేశారు.  ఆయన మరణంతో బీహార్ గొప్ప రాజకీయవేత్తను కోల్పోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అయితే దేశానికి, బీహార్ ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News