హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్స్ లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఒకటి. ఈ పథకంలో చేరడం వల్ల అధిక వడ్డీ లభిస్తుంది. మోడీ ప్రభుత్వం ఇటివలే చిన్న సేవింగ్ స్కీమ్ పై వడ్డీ రెట్లు పెంచింది. అలాగే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పై కూడా వడ్డీ రేట్లు పెంచింది. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 8.2 శాతం వడ్డీ వస్తుంది. ఈ పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు. ఈ పథకంలో డబ్బులు డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాల వరకు విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేదు. 5 సంవత్సరాల కాల పరిమితి తర్వాత అసలు, వడ్డీ తో కలిపి పోందవచ్చు. 60 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు.
పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్స్‌లో ఇది వరకు రూ. 15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు దీన్ని రూ. 30 లక్షలకు పెంచారు. ఈ స్కీమ్‌లో రూ. 30 లక్షలు ఇన్వెస్ట్ చేశారని అనుకుంటే.. ఐదేళ్ల కాలంలో 8.2 శాతం వడ్డీ రేటు ప్రకారం చూస్తే.. మీకు మెచ్యూరిటీ సమయంలో రూ. 42.3 లక్షలు లభిస్తాయి. అంటే మీకు వడ్డీ రూపంలోనే రూ. 12 లక్షలకు పైగా వస్తాయి. ఇంట్లో భార్యభర్తలు ఇద్దరూ ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో చేరితే అప్పుడు ఇద్దరికీ రూ. 12.3 లక్షలు వస్తాయి. అంటే ఇద్దరికీ కలిపి రూ. 25 లక్షల వరకు వస్తాయి. వడ్డీ డబ్బులు ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 61,500 వస్తాయి. వార్షికంగా వడ్డీ రూపంలోనే మీరు రూ. 2.46 లక్షలు పొందొచ్చు.