Monday, January 20, 2025

కారు పార్కింగ్ కోసం సిఎం కాన్వాయ్ ను అడ్డుకున్న వృద్ధుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కారు పార్కింగ్ కోసం సిఎం కాన్వాయ్ ను వృద్ధుడు అడ్డుకున్న సంఘటన బెంగళూరు లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. బెంగళూరు సిఎం సిద్ధరామయ్య ఇంటికి ఎదురుగా నరోత్తమ్ అనే వృద్ధుడు నివాసం ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం సిఎం ఇంటిని బయలు దేరిని సిఎం కాన్వాయి ని ఆయన అడ్డుకున్నారు. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యి వృద్ధుడుని అడ్డుకున్నారు. వృద్ధుడు సిఎం సిద్ధరామయ్యతో మట్లాడాలని కోరగా అందుకు అధికారులు అనుమతించారు.

సిఎం కారు వద్దకు వెళ్లిన వృద్ధుడు మిమ్మల్ని చూడడానికి వచ్చి వారు ఇష్టం వచ్చినట్లు వాహనాలను పార్కింగ్ చేస్తున్నారని, మా స్వంత కార్లకు పార్కింగ్ లేకుండా చేస్తున్నారని, మేము ఇంటిని నుండి కారులో బయటకు వెళ్లడానికి దారికి లేకుండా చేస్తున్నారని, గత ఐదు సంవత్సరాలుగా ఇలా జరుగుతుందని,దీంతో విసుగు చెంది తమ కాన్వాయ్ ని అడ్డకున్నట్లు వృద్ధుడు సిఎం సిద్ధరామయ్యతో తెలిపారు. వృద్ధుడు మాటలకు సిఎం సానుకూలంగా స్పందించి కారు పార్కింగ్ సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకొవాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News