Monday, December 23, 2024

సీనియర్ కమ్యూనిస్టు కామ్రేడ్ లింగమ్మ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన కమ్యూనిస్టు పార్టీ సీనియర్ సభ్యురాలు కప్పల లింగమ్మ (90) శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాదులో కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. నాగోల్ లోని చిన్న కుమారుని ఇంట్లో ఆమె మరణించారు. శనివారం స్వ స్థలం సూర్యాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. లింగమ్మ పెద్ద కుమారుడు కేవీఎల్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, ఐప్సో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఉన్నారు. చిన్న కుమారుడు కె.శ్రీనివాస్ ప్రజాపక్షం దినపత్రికలో హైదరాబాద్ బ్యూరో స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్ తల్లి రాములమ్మ , లింగమ్మలు సొంత అక్క చెల్లెలు.

సిపిఐ నాయకులు ఘన నివాళి
నాగోల్‌లో కామ్రేడ్ లింగమ్మ భౌతికకాయానికి సిపిఐ నాయకులు ఘన నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి ఎఐటియుసి సీనియర్ నాయకులు ఉజ్జిని యాదగిరిరావు తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబం అంకిత భావంతో కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాన్ని అనుసరించిందని కొనియాడారు. ఇంకా తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ ఎస్‌వి సత్యనారాయణ, ఆప్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ డి సుధాకర్, అరసం నాయకులు రాపోలు సుదర్శన్, సిపిఐ రాష్ట్ర నాయకులు రవీంద్ర చారి, యాదిరెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు పల్లె రవి, కాచం సత్యనారాయణ, తదితరులు లింగమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించారు,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News