Sunday, December 22, 2024

కాంగ్రెస్ సీనియర్ నేత ఇంద్రసేన్ రెడ్డి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంఎల్‌సి ఇంద్రసేన్ రెడ్డి (81)కన్నుమూశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో సోమాజిగూడ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన ఇంద్రసేన్ రెడ్డి ఇందిరాగాంధీ కుటుంబంతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు.

గతంలో ఎంఎల్‌సిగా పనిచేశారు. ఆయన కాలేజీ దశ నుంచే రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. 1960ల్లో ఆయన ఓయూ స్టూడెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఎపి కాంగ్రెస్ కమిటి ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఎఐసిసి సభ్యులుగా కొనసాగారు. 1982-83లో ఎపి స్టోర్స్ కౌన్సిల్ చైర్మన్‌గా, ఎపిఐడిసి చైర్మన్‌గా సేవలందించారు. ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్, ఎకనామిక్ కమిటీ, ఎగ్జిబిషన్ కమిటి సభ్యులగా కొనసాగారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగా ్గ ఇంద్రసేన్ రెడ్డి పాల్గొన్నారు.

ప్రముఖుల సంతాపం

మాజీ ఎంఎల్‌సి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన ఇంద్రసేన్ రెడ్డి మరణం పట్ల మంత్రులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ సంతాపం తెలిన వారిలో ఉన్నారు. ఇంద్రసేన్ రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News