Monday, December 23, 2024

బోధన్‌లో కాంగ్రెస్‌కు షాక్.. బిఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్ నేత

- Advertisement -
- Advertisement -

ఎంఎల్‌సి కవిత, ఎంఎల్‌ఎ షకీల్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత

బోధన్ : బోధన్‌లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తాజా మాజీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బగోని గంగాధర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గత పది ఏళ్ల కాలంగా కాంగ్రెస్ పార్టీలో పట్టణ ప్రధాన కార్యదర్శిగా పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కీలక బాధ్యతలను అబ్బగోని గంగాధర్ గౌడ్ నిర్వహిస్తూ వస్తున్నా ప్రతిపక్షంలో పదేళ్ల కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన సముచిత న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో పని చేసే కార్యకర్తలకు గుర్తింపు కరువైందని అన్నారు. కష్టపడి పని చేసిన పదవులు ఇవ్వకుండా అవమాన పరచడం వల్లనే పార్టీకి రాజీనామా చేసి బిఆర్‌ఎస్‌లో చేరడం జరిగిందన్నారు. పదేళ్ల కాలంపాటు ప్రతిపక్ష నాయకునిగా పట్టణంలో పని చేశామని, అధికారం ఉన్నా లేకపోయినా ఉన్న పార్టీ కోసం పని చేయడం తన కర్తవ్యం అన్నారు. నమ్ముకున్న పార్టీ కోసం నమ్మిన వ్యక్తుల కోసం పని చేయడమే తమ సిద్ధ్దాంతమని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే షకీల్ గెలుపు కోసం బిఆర్‌ఎస్ గెలుపు కోసం పని చేస్తానన్నారు. ఈ కార్యక్రమలో రాకాసిపేటవాసులు బిఆర్‌ఎస్ నాయకులు కిరాణా షాప్ ప్రసాద్, మండల శ్రీను, న్యాయవాది మహమూద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News