Saturday, December 21, 2024

రేవంత్‌కు సెగ!

- Advertisement -
- Advertisement -

Senior Congress leaders meet at Marrishasidharreddy's house

మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో
రాష్ట్ర సీనియర్ నేతల భేటీ

పాల్గొన్న విహెచ్, పొన్నాల, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, కోదండరెడ్డి, జగ్గారెడ్డి, కమలాకర్ రావు, జి.నిరంజన్, శ్యాం మోహన్ తదితరులు

మన తెలంగాణ/హైదరాబాద్: పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి నిర్ణయాల పట్ల అసంతృప్తిగా ఉన్న కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు తార్నాకలోని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్‌రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. మర్రిశశిధర్‌రెడ్డి, విహెచ్, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, కోదండరెడ్డి, జగ్గారెడ్డి, కమలాకర్‌రావు, జి.నిరంజన్, శ్యామ్‌మోహన్‌తో పాటు పలువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరంతా పిసిసి చీఫ్ రేవంత్ నిర్ణయాల పట్ల కొంత అసంతృప్తితో ఉన్నారు. గతంలో ఓసారి మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల ఇంట్లో సమావేశమై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పిసిసి తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చించారు.

తాజా భేటీలో దాదాపు 13 నుంచి 14 మంది సీనియర్ నేతలు సమావేశమైనట్లు తెలుస్తోంది. మరికొంతమంది నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అటు ఎఐసిసిలో జరుగుతున్న తాజా పరిణామాలతో పాటు.. రాష్ట్రంలో కాంగ్రెస్‌లో రాజకీయాలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆదివారం సిడబ్లూసిలో తీసుకున్న నిర్ణయాలకు మద్ద తు తెలపడంతో పాటు పిసిసి నిర్ణయాలు, కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది. పిసిసి చీఫ్ ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నట్లు భావిస్తున్న వీరంతా పిసిసికి తగిన రీతిలో సలహాలు, సూచనలు చేయాలా? లేదంటే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలా? అనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News