జిల్లాలో సర్వేల్యాండ్స్‌లో నక్ష పనులు నిర్వహించే సీనియర్ డ్రాఫ్టుమెన్ జ్యోతిశర్మబాయి ఓ వ్యక్తి నుండి రూ.20 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ శివనగర్‌కు చెందిన తాళ్ల కార్తీక్ కురవి మండలంలోని స్టేషన్ గుండ్రాతి మడుగులో రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు మీడియేటర్ ద్వారా తెలుసుకున్నాడు. భూమికి సంబంధించి పూర్తి వివరాలు క్లియరెన్స్, నక్ష కోసం సర్వేల్యాండ్స్‌లో సీనియర్‌డ్రాప్టుమెన్‌గా పని చేస్తున్న కే.జ్యోతిశర్మబాయిని గత నెల 28న ఆశ్రయించాడు. దీంతో ఆమె నక్ష, చలానా కట్టేందుకు రూ.5 కట్టాల్సి ఉంటుందని చెప్పడంతో కార్తీక్ ఇస్తాడు.
ఆ తర్వాత నక్ష కావాలని జ్యోతిశర్మబాయిని కలువగా, నక్షకే రూ.5 వేలు అవుతుంది. మరీ నాకు కూడా రూ.20 వేలు నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. దీంతో కార్తీక్ ఈ నెల 12న వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్యను కార్తీక్ జరిగిన తీరును వివరిస్తాడు. కాగా, గురువారం ఏసీబీ అధికారుల సూచనలతో కార్తీక్ కలెక్టర్ కార్యాలయంలోని సర్వేల్యాండ్స్ విభాగానికి చేరుకుని జ్యోతిశర్మబాయిని రూ.20 వేలు ఇస్తాడు. ఈ క్రమంలోనే ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో జ్యోతిశర్మబాయిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జ్యోతిశర్మబాయిని వరంగల్ ఏసీబీ కోర్టులో రిమాండ్‌కు తరలించారు. ఈ దాడుల్లో సీఐలు ఎల్.రాజు, ఎస్.రాజు, సిబ్బంది పాల్గొన్నారు.