Monday, January 20, 2025

ఎన్‌ఎస్‌జి డిజిగా నళిన్ ప్రభాత్ నియామకం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్‌ఎస్‌జి) డైరెక్టర్ జనరల్‌గా ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1992 బ్యాచ్ ఐపిఎస్ అధికారి నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ప్రస్తుతం సిఆర్‌పిఎఫ్ అదనపు డైరెస్టర్ జనరల్‌గా పనిచేస్తున్న నళిన్ ప్రభాత్‌ను ఎన్‌ఎస్‌జి డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

2028 ఆగస్టు 31వ తేదీ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ నియామకంతోపాటు..ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబి) ప్రత్యేక డైరెక్టర్‌గా ఒడిశా క్యాడర్‌కు చెందిన 1992 బ్యాచ్ ఐపిఎస్ అధికారి సప్నా తివారీని కేంద్రం నియమించింది. ప్రస్తుతం ఐబిలో అదనపు డైరెక్టర్‌గా పనిచేస్తున్న సప్నా తివారీని అందులోనే ప్రత్యేక డైరెక్టర్‌గా నియమించింది. ఆమె ఈ పదవిలో 2026 ఏప్రిల్ 30 వరకు కొనసాగుతారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News