Friday, December 20, 2024

సీనియర్ జర్నలిస్ట్ సి.నరసింహారావు కన్నుమూత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజకీయ, సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ సి.నరసింహారావు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి 1.50 గంలకు తుదిశ్వాస విడిచారు. హైదరాబాలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు  తెలిపారు. సి.నరసింహారావు 1948, డిసెంబర్ 28న క్రిష్ణా జిల్లా పెద్ద పాలపర్రులో జన్మించారు. వ్యక్తిత్వ వికాసంపై నరసింహారావు అనేక పుస్తకాలు రచించారు. విజయీభవ, విజయపథం, వ్యక్తిత్వ వికాసం, అన్యోన్య దాంపత్యం, పిల్లల్ని ప్రతిభావంతులుగా పెంచడం ఎలా?, బిడియం వద్దు, అద్భుత జ్ఞాపకశక్తి వంటి అనేక పుస్తకాలు రచించారు. జర్నలిస్టుగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఆయన కృషి ఎంతో ఉంది.

Senior Journalist C Narasimha Rao Passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News