Sunday, January 19, 2025

సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్‌విఎం కృష్ణారావు కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీహెచ్‌వీఎం కృష్ణారావు హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 64. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న కృష్ణారావు గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. రాజకీయ నాయకులంతా బాబాయ్‌గా పిలుచుకునే కృస్ణారావు జర్నలిజం ప్రస్తానం 1975లో ఒక స్టింగర్‌గా ప్రారంభమైంది.

అనంతరం ఈనాడుతో మొదలై, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో సాగింది. కృష్ణారావు విశేషమైన 47 ఏళ్ల కెరీర్ జర్నలిజం రంగంపై ఆయనకున్న అచంచలమైన అంకితభావానికి నిదర్శనం. డెక్కన్ క్రానికల్ న్యూస్ బ్యూరో చీఫ్‌గా ఆయన సుదీర్ఘమైన పాత్ర ఉంది. అక్కడ అతను 18 సంవత్సరాలకుపైనే పనిచేశాడు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె, ఇద్దరు మనుమలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News