Thursday, January 23, 2025

సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే మూడో పెళ్లి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే తన 68వఏట ముచ్చటక మూడవసారి పరిణయమాడారు. ఆదివారం లండన్‌లో ఆయనకు ట్రీనాతో వివాహం జరిగింది. అత్యంత వైభవంగా జరిగిన ఈ పెళ్లికి నీతా అంబానీ, లలిత్ మోడీ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

1999 నుంచి 2002 వరకు భారత సొలిసిటర్ జనరల్‌గా పనిచేసిన హరీష్ సాల్వే 38 ఏళ్ల క్రితం మొదటిసారి మీనాక్షిని పెళ్లి చేసుకున్నారు. 2020లో వారిద్దరూ విడిపోయారు. వారికి ఇద్దరు కుమార్తెలు. 2020లో కరోలిన్ బ్రాసార్డ్ అనే మహిళను సాల్వే రెండవసారి వివాహం చేసుకున్నారు.

అనేక సంచలనాత్మకమైన కేసులను వాదించిన హరీష్ సాల్వే గూఢచర్య ఆరోపణలతో పాకిస్తాన్‌లో మరణశిక్షను ఎందుర్కొంటున్న కుల్‌భూషణ్ జాదవ్ కేసును కూడా వాడించారు. 2015లో సల్మాన్ ఖాన్ కారు నడిపి పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కొందరి మరణానికి కారణమైన కేసును కూడా సల్మాన్ తరఫున సాల్వే వాదించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News