Monday, December 23, 2024

మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు మరో షాక్..

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్రలో గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ లోనే ఉన్న సీనియర్ నేత బాబా సిద్ధిక్ గురువారం పార్టీని విడిచిపెడుతున్నట్టు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆకస్మికంగా రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది. తాను యువకుడిగా ఉన్నప్పుడే కాంగ్రెస్‌లో చేరానని, 48 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నానని, ఇప్పుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని ప్రకటించారు.

చెప్పడానికి చాలా ఉన్నా, కొన్ని విషయాలు చెప్పకపోవడమే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లు తనకు అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, సహచరులకు ధన్యవాదాలని తన ఎక్స్ (ట్విటర్ ) వేదికగా వివరించారు. ఇటీవల సిద్ధిక్ తన కుమారుడితో సహా రాష్ట్రడిప్యూటీ సిఎం అజిత్ పవార్‌ను కలియడం . ఆయన త్వరలో ఎన్సీపీలో చేరే అవకాశాలు ఉన్నట్టు ఊహాగానాలు చెలరేగాయి. అది జరిగిన కొన్ని రోజుల వ్యవధి లోనే సిద్ధిక్ రాజీనామా చేయడం గమనార్హం. మహారాష్ట్రలో కాంగ్రెస్ సీనియర్ నేత మిలింద్ దేవ్‌రా ఇటీవలనే తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

పార్టీలో శక్తివంతమైన యువనాయకుల్లో ఆయన ఒకరు. ఇప్పుడు సీనియర్ నేత సిద్ధిక్ రాజీనామా చేయడం మహారాష్ట్రలోని కాంగ్రెస్‌లో హఠాత్ పరిణామం. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు సిద్ధిక్ మొదట బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి)కు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. తరువాత బాంద్రా పశ్చిమ నియోజకవర్గం నుంచి 1999,2004,2009 లో వరుసగా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్ర ఆహార , పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. దీంతోపాటు మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ముంబై విభాగానికి ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News