Wednesday, January 22, 2025

ముంబైలో కాంగ్రెస్ పార్టీకి షాక్..

- Advertisement -
- Advertisement -

ముంబైలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ముంబై కాంగ్రెస్ సీనియర్ నేత రవి రాజా పార్టీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరుకున్నాడు. గురువారం డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. సియోన్-కోలివాడ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించాడు. అయితే టికెట్ రాకపోవడంతో రవిరాజా అసహనం వ్యక్తం చేస్తూ పార్టీని వీడాడు.

ఈ సందర్భంగా ఎక్స్ లో తన రాజీనామా లేఖను విడుదల చేస్తూ.. “1980 నుండి యూత్ కాంగ్రెస్ సభ్యునిగా, చాలా చిత్తశుద్ధి, అంకితభావంతో పార్టీకి సేవ చేశాను. 44 సంవత్సరాలకు పైగా పార్టీ సభ్యుడిగా ఉన్నాను.. సరైన గౌరవం దక్కలేదు.. అందుకే నేను పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాను” అని పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News