Monday, December 23, 2024

సీనియర్ మెడికో సైఫ్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరంగల్ కాకతీయ మెడికల్  ఘటనలో సీనియర్ మెడికో అయిన సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కూ తురు ప్రీతిపై సైఫ్ వే ధింపులకు పాల్పడుతున్నాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు సైఫ్‌పై పోలీసులు కే సు నమోదు పోలీసులు ఈ విషయ మై ప్రశ్నించి  అరెస్ట్ చేశారు. మెడికో ప్రీతిని విధుల విషయమై మాత్రమే మందలించినట్టుగా చెప్పినట్లుగా తెలుస్తోం ది. నిజానికి సైఫ్ వేధింపులకు పాల్పడుతున్నారని గతంలోనూ పై అధికారులకు ప్రీతి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.

సైఫ్ వేధింపులకు గురి చేస్తున్నారని మెడికో ప్రీతి ఫిర్యాదు చేసింది. ఈ విషయమై వీరిద్దరికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారని చెబుతున్నారు. ఇప్పుడు సైఫ్ ను అరెస్ట్ చేయడంతో వేధింపులు నిజమేనని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో ఏఎస్‌ఐగా పని చేస్తున్న నరేందర్ కూతురు ప్రీతి కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నది. విధుల్లో ఉన్నపుడే హానికరమైన ఇంజక్షన్ ను ఆమె తీసుకున్నారు. తోటి వైద్యులు ఈ విషయం గమనించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నం విషయాన్ని కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ ధ్రువీకరించారు. విధి నిర్వహణలో సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కేఎంసీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కొంత మంది విద్యార్థులు రోపించారు.
నిందితుడిపై అట్రాసిటీ కేసు..
కేసులో నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు ర్యాగింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్‌పై క్రైమ్ నంబర్ 69/2023 u/s 306 r/w 108 , 354 of IPC, 4(v) of ragging act, 3(1)(r), 3 (2)(va),3 (1)(w)(ii) of sc st act నమోదు చేశామని వరంగల్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ బోనాల కిషన్ తెలిపారు. బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి, ఈ కేసు నమోదు చేశామని తదుపరి విచారణ అనంతరం శాఖ పరమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా వివరించారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షార్హులే నని దోషులు ఎప్పటికైనా తప్పించు కోలేరని స్పష్టం చేశారు. అయితే, సంస్థాగతంగా పూర్తి స్థాయిలో విచారణ లేకుండా సామాజిక మధ్యమాల్లో వస్తున్న సమాచారం సరైనది కాదని, అందరూ సంయవనం పాటించాలని సూచించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News